
వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి -దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
-కౌకుంట్లలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
దేవరకద్ర, ఏప్రిల్ 15 (గోల్కొండ):రైతుల పండించిన ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేసి వారికి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం లోని కౌకుంట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక మరియు అప్పంపల్లి పిఎస్ఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విదేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రసంగించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి నేరుగా లాభం చేకూరే లా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి కొత్త అరవింద్ కుమార్ రెడ్డి, కౌకుంట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధకౌకుంట్ల మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, కురుమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల రైతులు, సంబంధిత అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


