ప్రజయ్ నివాస్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ప్రజయ్ నివాస్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

సీనియర్ సిటిజన్లు ,పారిశుధ్య కార్మికులకు సన్మానం
హైదరాబాద్ సిటీ ఆగస్టు 15 (గోల్కొండ ): ఎల్బీ నగర్ నియోజిక వర్గం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజయ్ నివాస్ ఫేజ్ 2లో శుక్రవారం 79 వ స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఎన్ శంకర్ రావు,కమిటీ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.స్వాతంత్య్ర సమరయోధుల పోరాటలను గుర్తు చేసుకున్నారు.అనంతరం కాలనీలోని సీనియర్ సిటిజన్లను కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. జిఎచ్ఎంసి పారిశుధ్య కార్మికులను సన్మానించారు.అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఎన్ శంకర్ రావు ,మాజీ అధ్యక్షుడు కొత్త తిరుమల్ ,కమిటీ సభ్యులు నరసింహ, శ్రావణ్ గౌడ్ ,సురేష్,విజయ, శరత్, కాలనీ సభ్యులు రైక శ్రీనివాస్ ,ఆవునూరి శ్రీనివాస్,భాస్కర్,రవి,నరేందర్ ,రామచంద్రం తదితరులున్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!