రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్‌-అలైవ్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్‌-అలైవ్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, రోడ్డు వెంట ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో మృతిచెందుతున్నారని తెలిపారు.
ప్రజా సంక్షేమం, భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలుచేస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్‌ల నుంచి సీఎం వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్‌ సేఫ్టీ కమిటీని 8 నుంచి 9 మందితో ఏర్పాటు చేయాలని, దానిలో విరమణ పొందిన ఉద్యోగులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీజీపీ పిలుపునిచ్చారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!