తెలంగాణలో మద్యం షాపుల కు 90 వేలకు పైగా దరఖాస్తులు

తెలంగాణలో మద్యం షాపుల కు 90 వేలకు పైగా దరఖాస్తులు

హైదరాబాద్, అక్టోబర్ 18 (గోల్కొండ ) : తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. శనివారం చివరి రోజు భారీగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ రోజు ఒక్కరోజే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అంచనా. తెలంగాణలో 2620 వైన్ షాపులకు గత నెల 27న టెండర్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5గంటలతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈనెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ లు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం.ఏపీకి చెందిన ఓ మహిళ 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం.ఏపీ మహిళలే కాదు, దరఖాస్తు చేసుకున్న వారిలో యూపీ, కర్ణాటక, ఒడిశాకు చెందిన మహిళలు కూడా ఉండటం విశేషం.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!