
కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని …మంత్రులు జూపల్లి, తుమ్మల
అంపశయ్య నవీన్, అంతడుపల రమాదేవి లకు పొన్నం సత్తయ్య జీవన సాపల్య పురస్కారం
హైదరాబాద్ సెప్టెంబరు 13 (గోల్కొండ ):కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని మంత్రులు జుపల్లి కృష్ణారావు,తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రవీంద్రభారతిలో పొన్నం సత్తయ్య జీవన సాపల్య పురస్కారం కార్యక్రమం చేపట్టరు .ఈ సందర్బంగా మంత్రులూ మాట్లడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి పేరిట ఏటా జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేయడం హర్షణీయమని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముగ్గురు కుమారులు గొప్ప స్థాయికి చేరుకోవడంతో పొన్నం సత్తయ్య గౌడ్ జీవితం సార్థకమైందని తెలిపారు. నాడు వలస వెళ్లి వారు ఎన్నో కష్టాలు పడ్డారని, బిడ్డలను ప్రయోజకులను చేయడం కోసం నిరంతరం శ్రమించారన్నారు. తండ్రి స్ఫూర్తితో పొన్నం ప్రభాకర్ అనేక ఉద్యమాలు చేశారని కొనియాడారు. ఉమ్మడి కుటుంబాలు నిర్వీర్యం కావడమే రైతుల కష్టాలు, ఆత్మహత్యలకు కారణమని ఓ సందర్భంలో అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏటా రచయితలకు, కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య జీవితసాపల్య పురస్కారాలకు ఈ ఏడాది సాహిత్యం విభాగంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపల రమాదేవి లకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు లు రవీంద్ర భారతిలో అట్టహాసంగా అవార్డులను ప్రధానం చేశారు.జీవన సాఫల్య పురస్కారం 2025 ఎంపిక కమిటీ కన్వీనర్ డా.పొన్నం రవిచంద్ర సారధ్యంలో జ్యూరీ కమిటీలో సీనియర్ పాత్రికేయులు కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ,సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , రచయిత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ వార్డులను ఎంపిక చేసింది. గత మూడు సంవత్సరాలు ఈ అవార్డులను సాహిత్య విభాగంలో నాళేశ్వరం శంకరం, నలిమెలా భాస్కర్, చంద్రబోస్ లు అందుకోగా కళాకారుల విభాగంలో ఒగ్గు ధర్మయ్య, కామ్రేడ్ విమలక్క, బలగం ఫేమ్ కొమురమ్మ అందుకున్నారు. ఈ సంవత్సరం అంపశయ్య నవీన్,అంతడుపుల రమాదేవి లకు ప్రధానం చేశారు.అంపశయ్య ననవీన్ రచనలు నిజాయితీ, సామాజిక చైతన్యం ,వ్యక్తిగత మానసిక స్థితులకు ప్రతిబింబంగా నిలుస్తాయి. వీరి రచనలు ఎక్కువగా వస్తూ ఆధారిత , విప్లవాత్మక మనో వైజ్ఞానిక కోణంలో ఉంటాయి. తెలుగు నవలా జానర్ లో సైకలాజికల్ రియలిజం తీసుకొచ్చిన రచయితల్లో అగ్రగణ్యుడు. అంతడుపుల రమాదేవి రమాదేవి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలు ,తెలంగాణ అస్తిత్వ గానాలతో తనదైన స్వరాలతో దశాబ్దల కాలం నుండి ఎన్నో భక్తిగీతాలు తెలంగాణ జానపద పాటల తో ఉత్తేజపరుస్తున్న కళాకారిణి ప్రజా గాయని అంతడుపుల రమాదేవి.పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి సందర్భంగా రవీంద్రభారతిలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందించారు. అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందించారు.కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాము వ్యవసాయ కుటుంబం నుండి వచ్చామని కరీంనగర్ అవార్డు గ్రహీత అయిన అంపశయ్య నవీన్ ఇంట్లో తానే స్వయంగా పాలు పోసేవాడినని గుర్తు చేసుకున్నారు. గత సంవత్సరం బలగం కొమురవ్వ కి అవార్డు ఇవ్వడం జరిగిందని వారికి ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు.పొన్నం సత్తయ్య 15 వ వర్ధంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వారికి నివాళులు అర్పించారు. పొన్నం సత్తయ్య గారి కుమారులు రైతు కుటుంబం నుండి వచ్చి తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యం ఉన్న అనేక మందిని గుర్తించి వారికి పురస్కారం అందిస్తున్నారని అభినందించారు.పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందుకున్న అంపశయ్య నవీన్,రమాదేవి లకు శుభాకంక్షలు తెలిపారు.పొన్నం సత్తయ్య అనేక సంవత్సరాలుగా తనకు తెలుసని వారు కస్టపడి పనిచేసే తత్వమని పిల్లలను బాగా చదివించి ప్రయోజకులు చేశారని కొనియాడారు. పొన్నం ప్రభాకర్ స్టూడెంట్ లీడర్ గా రాజకీయాల్లోకి నేడు కీలక మంత్రిగా ఎదిగి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని ప్రధానమైన చారిత్రాత్మక కార్యక్రమంలో బిల్లు పెట్టారని ఇప్పుడు పొన్నం సత్తయ్య ఉంటే ఆనందపడేవారని పేర్కొన్నారు.గతంలో తాను కరీంనగర్ ఇంచార్జి మంత్రిగా ఉన్నప్పుడు పొన్నం సత్తయ్య గారి ఇంటికి వెళ్లేదని ఎంతో ఆప్యాయత ఉండి సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తు చేసుకున్నారు. ఉపాధి కోసం బాంబే వెళ్లి మళ్ళీ భూమిని నమ్ముకొని కష్టాన్ని పిల్లలను ప్రయోజకులను చేసిన భూమి పుత్రుడు పొన్నం సత్తయ్య అని కొనియాడారు.పొన్నం ప్రభాకర్ తండ్రిని మించిన తనయుడని తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు.ఇపుడు బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి పోరాడుతున్నారని అభినందించారు.భూమి పుత్రుడు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం కవులు కళాకారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి దూరమైన ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కాపాడుకోవాలని సూచించారు.పొన్నం సత్తయ్య ఎంతో కాయ కష్టం చేసి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి పిల్లలను ప్రయోజకులను చేశారని ,పొన్నం ప్రభాకర్ చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు మంత్రి అయ్యారని ,తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార పార్టీ ఎంపీగా ఉండి అధిష్టానాన్ని ధిక్కరించి ఉద్యమాన్ని చేశారని .పోరాట యోధులుగా పొన్నం ప్రభాకర్ నిలిచారని అభినందించారు.కార్యక్రమంలో ఎంపీ సురేష్ షేట్కర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సి డబ్ల్యు సి సభ్యులు గిడుగు రుద్రరాజు,కార్పొరేషన్ చైర్మన్ లు చల్ల నరసింహారెడ్డి , జేరిపాటి జైపాల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ,జాజుల శ్రీనివాస్ గౌడ్ , బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తదితరులు ఉన్నారు.


