ఇరాన్ చర్చలకు రాకపోతే మరింత వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది: ట్రంప్

ఇరాన్ చర్చలకు రాకపోతే మరింత వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది: ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్ , ఏప్రిల్ 3: పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్‌లోని అల్బోర్జ్ ప్రాంతంలో గల అత్యంత ఎత్తైన ‘B1’ వంతెన లక్ష్యంగా అమెరికా – ఇజ్రాయెల్ దళాలు జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. 95 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో సామాన్య పౌరులు పెద్ద సంఖ్యలో బలయ్యారని తెలుస్తోంది.ఉత్తర ఇరాన్‌లోని కరాజ్ నగరంలో ఉన్న ఈ B1 వంతెన.. ఆ దేశంలోని అత్యంత సంక్లిష్టమైన, ఎత్తైన నిర్మాణాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ వంతెనపై వరుసగా రెండుసార్లు క్షిపణి దాడులు జరిగాయి. మొదటి దాడి జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపడుతుండగా, రెండవ దాడి జరిగినట్లు సమాచారం. మరణించిన వారిలో స్థానిక గ్రామాల నివాసితులతో పాటు, ప్రకృతి దినోత్సవం వేడుకల కోసం వంతెన సమీపంలో ఉన్న పర్యాటకులు కూడా ఉన్నారని సమాచారం.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!