శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ ఆగస్టు 31 (గోల్కొండ ):
ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్లపై, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో శిక్ష తప్పించుకోవాలని మాజీ మంత్రి హరీష్‌రావు చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బ్యారేజీల గురించి సభలో హరీష్‌రావు మాట్లాడాలని సూచించారు. కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో లఘుచర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టిందని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో.ఎలా కట్టాలో వారికి తెలీదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా కట్టింది కాబట్టే కూలిపోయిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని.. ఆమె కాళ్లు మొక్కి కేసీఆర్ వచ్చారని గుర్తుచేశారు. గతంలో అసెంబ్లీలో సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు .

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!