
రోడ్ సెప్టి పై విద్యార్థుల కు అవగాహన..
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి :ఎస్సై తిరుపతి
వీణవంక,ఏప్రిల్ 15గోల్కొండ ):అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వీణవంక మండలం కేంద్రం లోని స్థానిక బస్టాండ్ వద్ద ఎస్సై తిరుపతి ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు బుధవారం రోజు రోడ్ సెప్టి పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ..చిన్న పొరపాట్ల వలనే అనేక ప్రమాదాలు జరగడం వలన అనేక కుటుంబాలు ఇంటి పెద్దని కోల్పోవడం జరుగుందని అన్నారు.విద్యార్థి దశ నుంచే రోడ్ సెప్టి పై అవగాహన కల్పించాలని ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.విద్యార్థులందరు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు..మండల విద్యాధికారిని శోభారాణి మాట్లాడుతూ..విద్యార్థుల బాగా చదువుకొని ఉన్నతమైన స్థాయి చేరుకోవాలని అన్నారు. విద్యార్థుల ఎవరు కూడా వాహనాలను డ్రైవ్ చేయకూడదన్నారు.రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరు రోడ్డు భదత్ర నియమాలు పాటించాలని ప్రజలకు విద్యార్థులకు ఎస్సై విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తాళ్లపల్లి మహేష్ గౌడ్,గ్రామస్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


