జూబ్లీహిల్స్ లో నవీన్  యాదవ్ గెలుపు పక్క …మంత్రి పొన్నం ప్రభాకర్..

జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు పక్క …మంత్రి పొన్నం ప్రభాకర్..

ప్రభుత్వ పథకాలు ఇంటి ఇంటికి తీసుకెళ్లాలి ..
ఓటింగ్ శాతం పెంచి డివిజన్లో అత్యధిక మెజారిటీ తేవాలి
బూత్ ఇంచార్జ్ లకు దిశా నిర్దేశం …
హైదరాబాద్ అక్టోబరు 22 (గోల్కొండ ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గెలుపు పక్క అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్ గూడ డివిజన్ లో ఇంటి ఇంటా ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా యూసఫ్ గూడ డివిజన్ ఇంచార్జ్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఉప ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలనీ సూచించారు.నాయకులూ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కు సహకరించి డివిజన్లో అత్యధిక మెజారిటీ తీసుకు రావాలని దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రతి ఇంటి కి వెళ్లి ఓటర్లకు వివరారించాలని కోరారు.ఎన్నికల రోజు ఓటర్లను ఓటింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా బూత్ ఇంచార్జ్ లు తీసుకోవాలిసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.ప్రతి ఓటరును ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచేలా ప్రచారం చేయాలనీ సూచించారు.ఇంటి ప్రచారంలో బజ్జిలి కాల్చి ఓట్లు అభ్యర్థించారు.జూబ్లీహిల్స్ లో బి ఆర్ ఎస్ ,బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని అన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,తెలంగాణ గిరిజన డెవలప్ మెంట్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ,క్రీడాశాఖ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి నాయకులూ తదితరులు ఉన్నారు .

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!