
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ):తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డికి తెలుగు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. తెలుగు అస్తిత్వం కాపాడాల్సిన సమయం ఇదని ఉద్ఘాటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి బరిలోకి రావడం ఎన్డీఏ కూటమికి అతి పెద్ద సవాల్ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. నీలం సంజీవ రెడ్డి, పీవీ నర్సింహారావు, నందమూరి తారక రామారావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి. సోమవారం తాజ్ కృష్ణాలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడాతు .జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ల అస్తిత్వం కనుమరుగవుతోందని చెప్పుకొచ్చారు. సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలోకి రావడంతో ఎన్డీఏ కూటమికి బలమైన సవాల్ విసిరినట్లుగా అయిందని తెలిపారు. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ రాజీనామా అందరికీ ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయో అందరం గమనించామని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్లకి రాజ్యాంగాన్ని కాపాడాలనే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు


