
ఏసీబీ కి పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారిని
హైదరాబాద్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ):ఏసీబీ అధికారులు వరుస దాడులు చేసి రోజు లాంచ గొండులను పట్టుకుంటున్న అధికారుల తీరు మారడం లేదు .హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిని మణి హారిక ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు .ప్లాట్ ఎల్ ఆర్ ఎస్ క్లియర్ చేసేందుకు పది లక్షలు డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ డి ఎస్పీ శ్రీధర్ ఆధ్వరంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలో జారీ చేసిన ఫైళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
TAGS Hot News


