
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన.. సీఎం
హైదరాబాద్, ఆగస్టు 15 (గోల్కొండ ) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మంత్రి వర్గ సహచరులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పేరు పేరున పరిచయం చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన నేతల వద్దకు వెళ్లి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. ఇక బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు.. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి సైతం హాజరు కాలేదని తెలుస్తోంది


