జాతి ప్రయోజనమే ముఖ్యం వ్యక్తిగత విషయాల ఊసే వద్దు

– ఈనెల 30న సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం
– ముదిరాజుల సన్మాన సభ జాతి ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి
– బీసీ డీ నుండి ఏ మార్చేందుకు ఉమ్మడి ప్రణాళిక
– రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, డిసెంబర్ 26 (గోల్కొండ): ఈనెల 30న రాష్ట్ర రాజధాని రవీంద్ర భారతిలో జరిగే ముదిరాజ్ ఆత్మగౌరవ సన్మాన కార్యక్రమం క్రమ పద్ధతిలో జాతి ప్రతిష్టలు పెంచే విధంగా నిర్వహించాలని ఈ కార్యక్రమానికి సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లకు ప్రత్యేక ఆహ్వానాలతో గౌరవప్రదంగా ఆహ్వానించాలని అనంతరం వారి ప్రతిష్టను పెంచే విధంగా సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని ప్రత్యేక కమిటీలతో పర్యవేక్షణ మధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజ్ బిడ్డ పై ఉందని జాతి ప్రధానంగా ఎదుర్కొంటున్న బీసీ డీ నుండి ఏలోకి మార్చే విధానంపై ఉమ్మడి ప్రణాళికతో ముందుకు సాగే విధంగా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ నేతృత్వంలో కమిటీల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జ్ఞానేశ్వర్ కాసాని తదితరులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచన చేశారు. ప్రభుత్వం దృష్టికి సామూహికంగా ముదిరాజు జాతి ముందుకు సాగుతుందని కలిసొచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఐక్యంతో ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్కరి కృషి ఉండాలన్నారు. పాత విషయాల చర్చ రాకుండా వర్గ పోరు ప్రస్తావన లేకుండా కేవలం కార్యక్రమం దృష్టితో ముందుకు సాగాలన్నారు. గెలుపొందిన వారు 1500 సర్పంచులు, 2000 పైగా ఉప సర్పంచులు, 3000 వార్డ్ మెంబర్లు కార్యక్రమానికి రానున్నట్లు తెలుస్తుంది అని త్వరలోనే పూర్తి జాబితాలు తయారుచేసి కార్యక్రమానికి పిలుపుగా ముందుకు సాధనన్నట్లు కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సీనియర్ నాయకులు చొప్పరి శంకర్, హైదరాబాద్ కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు మొత్తా రోహిత్, మహబూబ్నగర్ డిసిసి అధ్యక్షులు సంజీవ్, రాజు, డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



