
ఘనంగా రాఘవేంద్ర బృందావనం లో గణేష్ వేడుకలు
నిజాంపేట్, ఆగస్టు 31 (గోల్కొండ): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ లోని రాఘవేంద్రా బృందావనంలో ఆదివారం వినాయకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ మహాగణపతి హోమాన్ని పండితులు వేద మంత్రాలతో నిర్వహించి అపార్ట్మెంట్ వాసులను ఆశీర్వదించారు. అనంతరం అల్పాహారం, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బోట్ల తిరుపతి, గణపతి రావు, శరత్ రెడ్డి, సందీప్, ధార్కోల్ శ్రీనివాస్ రావు, వేముల శ్రీనివాస్, గోవిందరావు, జితేందర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మెరుగు రమేష్, శివరామకృష్ణ, జానకిరామ్, రాంపుల్లారెడ్డి, రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్ వాసులు రోషి రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్, రాంబాబు అశోక్, శివప్రసాద్, శ్రీనివాస్ సాయి, రంగారావు, మురారి, జీవన్, రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


