కాంగ్రెస్ పార్టీలో చేరిన  బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కరీంనగర్ ఆగస్టు 22 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలో
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల,బిజిగిరి షరీఫ్ గ్రామాల పరిధిలోని పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.హుజురాబాద్ నియోజక వర్గ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .పార్టిలో చేరిన వారిలో తనుగుల పాక్స్ చైర్మెన్ పోల్సాని వెంకటేశ్వర్ రావు,బిజిగిరి షరీఫ్ గ్రామ తాజా,మాజీ సర్పంచ్ కటంగురి యుగంధర్ రెడ్డి లు చేరారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన 18 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవాడికి వెన్నెముకలాగా మారిందని,ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీలకు రెండు సార్లు కొనసాగింపు ఇచ్చినందుకు ప్రభుత్వానికి,హుజూరాబాద్ ఇంచార్జి గా ఉన్న ప్రణవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణవ్ తోనే సాధ్యమని ఆ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!