
పేదలకు పథకాలు ఫలాలూ అందాలి…జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ..

హైదరాబాద్ ఆగస్టు 20 (గోల్కొండ ):పేదలకు పథకాలు ఫలాలూ అందాలని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి , ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించరు.ఈ సమవేశంలో జిల్లా అభివృద్ధి & మౌలిక వసతులు రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పై చర్చించారు.సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఆర్థిక సహాయం, రైతు రుణ మాఫీ, పంటల నష్టపరిహారం, విద్యార్థులకు స్కాలర్షిప్స్, మైనారిటీ & మహిళల అభివృద్ధి పథకాల అమలుపై సమీక్ష చెశారు. రాబోయే ప్రణాళికలు యువత ఉపాధి అవకాశాలు, చిన్న & మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, రైతు బజార్ల విస్తరణ, ఆరోగ్య రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు పై సమీక్షించారు.గ్రామల్లో పార్టీ బలోపేతం గ్రామ, మండల స్థాయిలో పార్టీ శ్రేణులను బలోపేతం చేయడం, ప్రజల సమస్యలను నేరుగా వినిపించేలా వ్యవస్థను బలోపేతం చేయలని సుచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గ, పొన్నం ప్రభాకర్ ,ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్లు పాల్గొన్నరు.


