రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు

రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు

హైదరాబాద్ ఆగస్టు 19 (గోల్కొండ ) : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంజిత్ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో భాగస్వామ్యం ఉన్నందునే తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రంజిత్ రెడ్డితోపాటు డీఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈవో సత్యనారాయణ రెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.డీఎస్ఆర్ కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు. జూబ్లీహిల్స్ ,బంజారాహిల్స్ ,ఎస్ ఆర్ నగర్,సురారంలో సోదాలు కొనసాగుతున్నాయి. సిఆర్పీ ఎఫ్ బలగాల మధ్య సోదాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి సంబంధించి తెలంగాణ, కర్ణాటకలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఫిలింనగర్‌లో నిర్మిస్తున్న డీఎస్ఆర్ ప్రాజెక్ట్‌పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. డీఎస్ఆర్ ది వరల్డ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అధికారులు. 14.45 ఎకరాలలో 9టవర్లు, 344 యూనిట్స్‌తో భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నడీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కో ప్లాట్ రూ. 12 కోట్లు నుండి రూ. 15 కోట్లుకు అమ్మకాలు చేస్తున్నట్లు తేల్చిన అధికారులు. డీఎస్ఆర్ కంపెనీ ఇప్పటి వరకు 34 బడా ప్రాజెక్ట్‌లు నిర్మించినట్లు గుర్తించిన ఐటీ. ఈ మేరకు సోదాల్లో వందల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!