జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి..

హైదరాబాద్ ఆగస్టు 17 (గోల్కొండ ):జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అభ్యర్థి తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మహమూద్ ప్యారడైస్ ఫంక్షన్ హాల్,కృష్ణ నగర్ లో యూసుఫ్ గూడ డివిజన్ బూత్ ఇన్చార్జి లు , ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించరు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించండి .జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేస్తున్నాం.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనం కోరుకున్నది కాదు. ఆకస్మిక పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నిక వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలవడానికి అవకాశం వచ్చింది.గత 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ అభివృద్ధికి నోచుకోలేదు.. జూబ్లీహిల్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మీ,సాట్ చైర్మన్ శివసేన రెడ్డి,,కార్పొరేటర్ బాబా ఫసియుద్ధిన్,,నవీన్ యాదవ్,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ,కాంగ్రెస్ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!