బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

పాట్నా, ఆగస్ట్ 17 (గోల్కొండ ) : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం బిహార్‌లోని సాసారాంలో ఓట్ అధికార్ యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర ఆరోపణలు సంధించారు. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్ ఓట్లను తొలగించడం, జోడించడం ద్వారా ఎన్నికల్లో ఓట్లను దొంగిలించడానికి కొత్త కుట్ర జరుగుతోందని విమర్శించారు.దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇలాగే ఓట్లు చోరీకి గురయ్యాయని ఆయన ఆందోళన చెందారు.
రాజ్యాంగాన్ని రక్షించేందుకే తాను ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇలాగే ఓట్లు చోరీకి గురయ్యాయని ఆందోళన చెందారు. బిహార్‌లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల దొంగిలించేందుకు కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. దీని ద్వారా దేశ ప్రజలకు ఎన్నికల సంఘం ఎలా ఓట్లను చోరీ చేస్తుందో అర్థమవుతుందని చెప్పారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!