
ప్రజాయ్ నివాస్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..

హైదరాబాద్ సిటీ ఆగస్టు 16 (గోల్కొండ ):.కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ప్రజాయ్ నివాస్ ఫేజ్ 2 లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు .సెంట్రల్ కమిటీ కల్చరర్ సెక్రటరీ శ్రావణ్ గౌడ్ పర్యవేక్షణ లో యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమం కన్నులపండుగగా చేపట్టారు.కాలనీ యూత్ సభ్యులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని ఉట్టికొట్టారు. ఉట్టికొట్టిన యూత్ సభ్యులకు బహుమతులు అందజేశారు. గెలిచినా వారికీ కాలనీ వైస్ ప్రెసిడెంట్ వాసవి-రామచంద్రన్ లు మొదటి ,ద్వితీయ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ,యూత్ సభ్యులు పాల్గొన్నారు.

TAGS Hot News


