అపత్కరకాలంలో ప్రజలకు అండగా ఉండండి…. కాంగ్రెస్ క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు

అపత్కరకాలంలో ప్రజలకు అండగా ఉండండి…. కాంగ్రెస్ క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు

హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ): అపత్కకాలంలో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వం, అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి పని చేస్తుంది.రాష్ట్రంలో భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు, ప్రధానంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదలతో చాలా కష్టపడుతున్నారు.వారికి సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సహాయక చర్యలలో ప్రభుత్వ సిబ్బందికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిగా ఉండి ప్రజలను వరద బాధితులను ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు .తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో ముంపునకు గురైన ప్రాంతాలలో పోలీసులు మునిసిపల్ సిబ్బంది, రెవెన్యూ, హైడ్రా తదితర శాఖలు చేస్తున్న సేవలకు మీ వంతు బాధ్యత గా కార్యకర్తలు సహకారం అందించాలని సూచించారు. ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటే మంచినీరు, పాలు, ఆహార పదార్థాలు అందించలాని కోరారు.
విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా బుధవారం దర్శనం చేసుకున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!