నేడు అవార్డు అందుకోనున్న విద్యార్థిని వడ్లనిత్య

నేడు అవార్డు అందుకోనున్న విద్యార్థిని వడ్లనిత్య

దేవరకద్ర, ఏప్రిల్ 13 (గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణానికి చెందిన జర్నలిస్టుల సంఘం దేవరకద్ర మండల గౌరవ అధ్యక్షుడు వడ్ల రమేష్ చారి, మాధురి దంపతుల కూతురు విద్యార్థిని వడ్ల నిత్య ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి అవార్డు అందుకోనుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సంస్కార విద్యాలయంలో విద్యార్థిని నిత్య 8వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల హైదరాబాద్ లో అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో విద్యార్థిని వడ్ల నిత్య రాష్ట్రస్థాయి పోటీలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ సాధించింది. దీంతో హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 11 గంటలకు టాలెంట్ టెస్ట్ నిర్వాహకులు అవార్డు అందజేయనున్నట్లు ఆ పాఠశాల సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!