ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి రూరల్ సిఐ లక్ష్మి నారాయణ

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి రూరల్ సిఐ లక్ష్మి నారాయణ

వీణవంక,ఏప్రిల్ 13 ,(గోల్కొండ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా
అరైవ్ అలైవ్ రోడ్ సెప్టి కార్యక్రమాన్ని మండలం లోని కోర్కెల్ గ్రామం వద్ద జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మి నారాయణ, ఎస్సై తిరుపతి లు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.ప్రధాన రహదారి పై కిలో మీటర్ మేర రహదారి పై ఉన్న గుంతలను పోలీసులు, గ్రామ రోడ్ సెప్టి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మట్టి తో పూడ్చేశారు.ఈ సందర్బంగా సీఐ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ…కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఆరు రోజుల పాటు విలేజ్ రోడ్ సెప్టి కమిటీ సభ్యుల కు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే బాదితులకు వైద్య సహాయం తో పాటు,తక్షణమే హాస్పిటల్ కు తీసుకెల్లెందుకు ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ తో ఈ కార్యక్రమాన్ని మండలం లోని ప్రతి గ్రామం నుండి రోడ్ సెప్టి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.తద్వారా తక్షణమే బాదితుల ప్రాణాలు కాపాడటానికి పోలుసులు,విలేజ్ రోడ్ సెప్టి కమిటీ ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించి తమ గమ్య స్థావరాలకు చేరుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై వెంకట్ రెడ్డి,సర్పంచ్ పూదరి రమ్య అనిల్, విలేజ్ రోడ్ సేప్టి కమిటీ సభ్యులు, గ్రామస్థులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!