
ఇరాన్‌తో ఒప్పందం కుదరలేదు.. వెనక్కు వెళ్లిపోతున్నాం: జేడీ వాన్స్
ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఎటువంటి ఒప్పందం కుదరలేదని అన్నారు. అమెరికాకు వెళ్లిపోతున్నామని కూడా చెప్పారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాక్ వేదికగా జేడీ వాన్స్ ఇరాన్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
చర్చలకు సంబంధించి మాకు కొన్ని హద్దులు ఉన్నాయని మొదట్లోనే స్పష్టంగా చెప్పాము. ఇతర విషయాల్లో పట్టువిడుపుల ధోరణి ఉంటుందనీ అన్నాము. కానీ కొన్నింటిని వారు అంగీకరించలేకపోయారు. ఇరాన్ ప్రతినిధులతో అనేక ముఖ్య విషయాలపై చర్చలు జరిపాము. అయితే, గల్ఫ్‌లో దీర్ఘకాలిక ప్రాతిపదికన శాంతిని నెలకొల్పేలా వారు ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయారు’ అని వాన్స్ ఇస్లామాబాద్‌లో జరిగిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.
‘అణ్వాయుధాల అభివృద్ధికి ప్రయత్నాలు ఉండబోవన్న హామీ కావాలి. మేము ఆశిస్తున్న విషయం ఇదే. త్వరిత గతిన ఈ ఆయుధాన్ని సాధించే ప్రయత్నాలు ఏవీ జరగవన్న హామీ కావాలి. అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం ఇదే. ఈ చర్చల్లో ఇలాంటి హామీల కోసమే ప్రయత్నించాము’ అని వాన్స్ పేర్కొన్నారు.
ఇరాన్‌తో డీల్ కుదరలేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో అన్న ఆందోళన పతాకస్థాయికి చేరుకుంది. ఇక వాన్స్ ప్రకటనపై ఇరాన్ ఎంబసీ కూడా ఘాటుగా స్పందించింది. యుద్ధంతో సాధించలేనిది మరో మార్గంలో సాధిద్దామని యూఎస్ భావించినందుకే చర్చలు విఫలమయ్యాయని చెప్పింది. చర్చలు ముగిశాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఘానాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. హోర్ముజ్ జలసంధి ఇప్పటికీ మూసే ఉండటంతో వాన్స్ రిక్త హస్తాలతో వెనుదిరిగారని కూడా వ్యాఖ్యానించింది.


