
మహాత్మా జ్యోతి రావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం..ప్రణవ్.
దేశంలో విద్య సమాన హక్కు అని నినదించిన వ్యక్తులు పూలే దంపతులు..
హాజరైన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..
హుజురాబాద్ ఏప్రిల్ 11 (గోల్కొండ ):సమాజంలో విద్య సమాన హక్కు అని,కులాలకు,మతాలకు అతీతంగా విద్య అందరికీ అందివ్వాలని నినదించిన మహనీయులు పూలే దంపతులు అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలో జ్యోతి రావు పూలే 200వ జయంతి కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించగా దానికి ముఖ్య అతిథిగా ప్రణవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి వారు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని వాటికి అనుగుణంగా పని చేశారని,రానున్న తరాలకు మహనీయులను స్మరించుకునేందుకు ఈ వేదికలు చాలా ఉపయోగపడుతాయని అన్నారు.హుజురాబాద్ లో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కమిటీ వారు కోరగ.. సానుకూలంగా స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థ మెరుగైన స్థాయిలో ఉందని,స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా శాఖ మంత్రిగా ఉండడం,వారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో,పూలే విద్యాలయాల్లో తీర్చిదిద్దుకుంటున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్లు,హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,పూలే జయంతి కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


