గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

సంగారెడ్డి ఏప్రిల్ 10 (గోల్కొండ ):జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ అగ్ని కీలలకు పరిశ్రమ చుట్టుపక్కల మెుత్తం దట్టమైన పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ప్రమాద సమయంలో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంత మంది అక్కడి నుంచి తప్పించుకోగా.. మరికొంతమంది ఇంకా పరిశ్రమలోనే ఉన్నట్లు సమాచారం. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పలువురు కార్మికులు, స్థానికులు చెబుతున్నారు. అయితే, పలు రకాల రసాయనాల నిల్వలు అక్కడ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు అంటున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!