హరిహర క్షేత్రం లో  కార్తీక దీపోత్సవం

హరిహర క్షేత్రం లో కార్తీక దీపోత్సవం

వీణవంక,నవంబర్ 05(గోల్కొండ):
కార్తీక మాసం పురస్కరించుకొని మండలం లోని మామిడాలపల్లి వీణవంక, చల్లూర్ లతో పాటు పలు ఆలయాలలో తెల్లవారు జాము నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి,దీపాలు వెలిగించారు.నర్సింగాపూర్ గ్రామం లోని హరిహర క్షేత్రం దేవస్థానం లో సాయంత్రం వేద మంత్రోచ్చరణల మధ్య ఆకాశ దీపోత్సవ కార్యక్రమం చేపట్టారు.. అనంతరం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ముగ్గులు వేసి మంగళహరతులతో పూజలు నిర్వహించారు.పెద్ద ఎత్తున తమల పాకులతో పువ్వుల పై ప్రమీదలు పెట్టి శివలింగం, ఓం, స్వస్తిక్, శంకు చక్రాలతో కూడిన విష్ణు నామం జై శ్రీరామ అను రూపాలలో దీపాల అలంకరణలు చేశారు. దీపావల అలంకరణ తో ఆలయ ప్రాంగణమంతా కాంతివంతంగా మారింది.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాధాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!