
బీహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి ….
పాట్నా అక్టోబరు 12 (గోల్కొండ) : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య ఆదివారంనాడు సీట్ల షేరింగ్ ఫార్ములా ఖరారైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా సామాజిక మాధ్యమంలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. సీట్ల కేటాయింపులో భాగంగా భారతీయ జనతా పార్టీ , జనతా దళ్ యునైటెడ్ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. భాగస్వామ్య పార్టీలైన లోక్‌జన్ శక్తి కు 29 సీట్లు కేటాయించారు. రాష్ట్రీయ లోక్ మోర్చా కు 6 సీట్లు, హిందుస్థాన్ అవామీ మోర్చా కు 6 సీట్లు కేటాయించారు.ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ కేటాయింపులను స్వాగతించినట్టు కూటమి నేతలు వెల్లడించారు. తమ కూటమి బిహార్‌లో తిరిగి అధికారం చేపట్టగలదనే ధీమాను వ్యక్తం చేశారు.
షెడ్యూల్ ప్రకారం, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


