
నంది మేడారం శివాలయంలో హుండీ దొంగతనం
ధర్మారం, సెప్టెంబర్ 13 (గోల్కొండ): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గల హుండీని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆవుల రాజేశం యాదవ్, ఉపాధ్యక్షుడు దేవి కొమురేష్ తెలిపారు. ఆలయ ద్వారం తాళం పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాలు, ఇతర ప్రాంతాలలో గాలింపు చేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాచూరి కిషన్, ఉత్తమ్ రాజయ్య, మందపల్లి మల్లేశం, పూజారి శ్యాం కుమార్ ఉన్నారు.
TAGS Hot News


