మంచిర్యాలలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

మంచిర్యాలలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

డీసీపీ భాస్కర్
…. శోభ యాత్ర రూట్ పరిశీలన

మంచిర్యాల, గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. బుధవారం మంచిర్యాల పట్టణంలో నిమజ్జనానికి తరలించే గణేష్ విగ్రహాల రూట్ మ్యాప్ ను డిసిపి తోపాటు ఎసిపి ప్రకాష్, సీఐ ప్రమోదరావు, తాసిల్దార్ రఫాతులాఖాన్ ఖాన్ హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ గణేష్ మండపాలు నిర్వాహకులు పోలీసుల ఆంక్షల మేరకు శోబయాత్ర చేపట్టాలని, డీజె లు వాడవద్దని, మద్యం మత్తులో అల్లరి చేయవద్దని హెచ్చరించారు. గోదావరి గట్ల వద్ద ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం లోపు నిమజ్జన శోభాయాత్ర ముగించాలని అన్నారు. శోభయాత్ర పోలీస్ పహారాలో సాగుతుందని వెల్లడించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!