బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ

బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కవిత బహిష్కరణ

హైదరాబాద్ సెప్టెంబర్ 02 (గోల్కొండ )

బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీపై ఆమె గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూడా కేటీఆర్, హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!