
యువత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి – MP గడ్డం వంశీ
మంచిర్యాల, యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ కి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, రాబోయే రోజుల్లో యువత ఉన్నత విద్యతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0 రీజినల్ రౌండ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. దేశ భవిష్యత్తు, నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఆలోచనాధారులను స్వాగతిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, యువతను ఉద్దేశించి విలువైన సందేశం ఇచ్చారు. పలువురు వ్యాపారవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.రెండు రోజుల సమావేశాల్లో యువత, నిపుణులు, నాయకులు కలిసి దేశ అభివృద్ధి, నాయకత్వం, కొత్త ఆలోచనలపై చర్చించనున్నారు. విద్య ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం అని దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలనే ఆలోచనతోనే ఆధునాతన సాంకేతికతతో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, పార్లమెంట్లో చాలా మంది యువ నేతలు ఉన్నారని గుర్తు చేశారు.



