
గణపతి నవరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు – డిసిపి భాస్కర్
– పోలీసులకు ప్రజల సహకరించాలి
– విద్యుత్ చౌర్యం చేస్తే కేసులు
– మండపాల వద్ద చట్ట వ్యతిరేక చర్యలు చేపడితే కఠిన చర్యలు
– పాత మంచిర్యాల రామాలయంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించిన డిసిపి, ఏసిపి, సీఐ
– సన్మానించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్

మంచిర్యాల పట్టణం పాత మంచిర్యాల పురాతన దేవాలయం రామలింగేశ్వర ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. విగ్రహ ప్రతిష్ట అనంతరం జరిగిన మొదటి పూజలకు మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, ఏసిపి ప్రకాష్, సిఐ ప్రమోద్ రావు లు ప్రత్యేక ఆహ్వానితుగా హాజరయ్యారు. గణనాథునికి సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డిసిపి, ఏసిపి, సీఐలకు ఆత్మీయ సన్మానం చేశారు. అనంతరం డిసిపి భాస్కర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు సంప్రదాయంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు. మండపాల వద్ద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించారు. పోలీస్ శాఖ సూచించిన విధంగా గణేష్ మండపాల పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం ఉచిత విద్యుత్ మండపాలకు అందిస్తున్న నేపథ్యంలో ప్రమాదకరంగా విద్యులకు కరెంటు వైర్లు అమర్చుకోవద్దని అన్నారు. సోషల్ మీడియాలో జరిగే వదంతులను నమ్మవద్దని, వాస్తవ సమాచారం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, రామాలయం కమిటీ అధ్యక్షులు, సింగిల్ వినో డైరెక్టర్ తూముల వెంకటేష్, నాయకులు తూముల వెంకటరామయ్య, శ్రీనివాస్ బొల్లం భీమయ్య, బొలిశెట్టి మల్లేష్, తూముల ప్రభాకర్, గౌతమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.


