హైదరాబాద్‌లో ‘పిల్లి’ పంచాయితీ.. మొక్కల వ్యాపారిపై దొంగతనం ఆరోపణ.. పోలీసుల కౌన్సెలింగ్

హైదరాబాద్‌లో ‘పిల్లి’ పంచాయితీ.. మొక్కల వ్యాపారిపై దొంగతనం ఆరోపణ.. పోలీసుల కౌన్సెలింగ్

హైదరాబాద్ ఏప్రిల్ 10 (గోల్కొండ ):
హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పెంపుడు పిల్లి చుట్టూ హైడ్రామా జరిగింది. ఈ వ్యవహరం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. పిల్లి దొంగతనం ఆరోపణలు, బైక్ నంబర్ ఆధారంగా గాలింపు, చివరకు పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణ ఒక సినిమా సీన్‌ను తలపించింది. పెంపుడు జంతువులపై ఉండే ప్రేమ ఒక్కోసారి పోలీసు స్టేషన్ మెట్లెక్కిస్తుంది. లాలాగూడలో ఒక ఖరీదైన పెంపుడు పిల్లి కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ వివాదం, పోలీసుల జోక్యంతో ఒక కొలిక్కి వచ్చింది.
లాలాగూడ పరిధిలో నివసించే ఓ మహిళ తన పెంపుడు పిల్లి అకస్మాత్తుగా కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. వెంటనే పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఆ ప్రాంతంలో మొక్కలు అమ్ముకునే వ్యక్తి పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. మొక్కలు అమ్మే వ్యక్తి తన పిల్లిని దొంగిలించి ఎత్తుకెళ్లాడని, అతని బైక్ నంబర్ ఆధారంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న లాలాగూడ పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి, నిందితుడు చింతల్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!