
హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి):భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం కొంపల్లిలో నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో మన పిల్లలను కమిట్మెంట్ తో, కన్విక్షన్ తో ఈ దేశ ఎదుగుదలలో భాగం పంచుకునీ గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు హర్ గర్ తిరంగ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ శేషగిరి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, కొంపల్లి మండల అధ్యక్షులు సతీష్ సాగర్, జాయింట్ కన్వీనర్ శివాజీ, సరిత, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


