
సీజేఐ గవాయ్‌పై దాడి.. చీకటి రోజుగా అభివర్ణించిన రేవంత్..
హైదరాబాద్ అక్టోబరు 06 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రేవంత్ ట్వీట్ చేశారు. దేశ న్యాయవ్యవస్థలోని అత్యున్నత అధికారిపై దాడి చేసి బెదిరించడానికి జరిగిన దుర్మార్గపు ప్రయత్నాన్ని తాను మాటల్లో ఖండించలేనని చెప్పారు. ఇది మన దేశ చరిత్రలో చీకటి రోజు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇటువంటి పిరికి దాడులకు తాను భయపడబోనని ధైర్యంగా ప్రకటించిన ధైర్యవంతుడైన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ కి దేశ పౌరులతో కలిసి తాను సంఘీభావం ప్రకటిస్తున్నట్లు రాసుకొచ్చారు..
TAGS Hot News


