బీజేపీలో చేరాలనుకునే నాయకులారా జర జాగ్రత్త ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ )
‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ కార్యకర్తలకు ఏ పదవీ ఇప్పించుకోలేరు. మీకు టికెట్‌ గ్యారంటీ ఉండదు’అని హెచ్చరించారు. చేరినప్పుడు మొదటి వరుసలో సీటు, తరువాత చివరి సీటులో కూర్చుంటారని పేర్కొన్నారు. 11 ఏళ్లు అణచివేతను ఎదుర్కొన్నానని అన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నుకున్న కార్యకర్తల కోసం ఏమి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు .కొంత మంది వ్యక్తుల వాళ్ళ పార్టీ సర్వనాశనం అవుతుందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుందని అన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!