బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా…న్యాయపరంగానే ఎదుర్కొంటా..కేంద్ర మంత్రి

బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా…న్యాయపరంగానే ఎదుర్కొంటా..కేంద్ర మంత్రి

న్యాయపరంగానే ఎదుర్కొంటా.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి

హైదరాబాద్ సెప్టెంబర్ 15 (గోల్కొండ ):

భారాస నేత కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావా వేసి తనను బెదిరించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, తాను న్యాయపరంగానే ఎదుర్కొంటానని మంత్రి బండి సంజయ్ తెలిపారు. కేటీఆర్ లాగా దావాలు వేయాలంటే తాను అనేక కేసులు వేయవచ్చని, కానీ, తాను ఎవరినీ బెదిరించేందుకు దావాలు వేయనని చెప్పారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్లకు దావా పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ మేరకు కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, డిసెంబర్ 15వ తేదీకి విచారణను వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడంతోనే ఈ పరువునష్టం దావా వేశారు
ఎమ్మెల్యేల ఫోన్లు, తన కుటుంబసభ్యుల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించారని గతంలో బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలపై ఆగస్టులో కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ నుంచి నోటీసులకు రిప్లై రాకపోవడంతో తాజాగా పరువు నష్టం దావా వేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!