
తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్….
హైదరాబాద్ అక్టోబరు 29 (గోల్కొండ ):
తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలోనే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
TAGS Hot News


