
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
హైదరాబాద్ అక్టోబరు 06 (గోల్కొండ ): : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు త్వరలో తెరపడనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈనెల 13న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు ఈనెల 21 వరకు గడువు విధించనున్నట్లు సమాచారం. అలాగే స్వీకరించిన నామినేషన్లను 22వ తేదీన పరిశీలన చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
TAGS Hot News


