
జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై మహేశ్ గౌడ్ రియాక్షన్
హైదరాబాద్ ఏప్రిల్ 09 (గోల్కొండ ):మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని ప్రస్తావించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 14 సార్లు బీ ఫాం ఇచ్చిందని గుర్తుచేశారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న నేత సీఎం రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు..? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి గురించి అనేక సార్లు జీవన్ రెడ్డి విమర్శించారని మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు.
TAGS Hot News


