కేంద్రమంత్రులు బీజేపీ ఎంపీ లు యూరియా అందించడంలో విఫలం .

కేంద్రమంత్రులు బీజేపీ ఎంపీ లు యూరియా అందించడంలో విఫలం .

హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ):
తెలంగాణకు యూరియా అందించడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీ లు విఫలమయ్యారని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అన్నారు .
హైదరాబాద్ లోని అసెంబ్లీ సి.ఎల్. పి మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపాతి రెడ్డి కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మా ట్లాడుతూ నిత్యం రాజకీయాల గురించి మాట్లాడే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు బిజెపి కేంద్రమంత్రులు మిగతా బిజెపి ఎంపీలు తెలంగాణ కు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం చెందారు.ఇప్పటి వరకు రెండు లక్షల 69 వేల మెట్రిక్ టన్ను లోటు ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఉన్నది అంటే దానికి కారణం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం.ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఎనిమిది లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరపర చేయవలసి ఉండగా ఇప్పటివరకు స్వదేశీ యూరియా నాలుగు లక్షల 34 వేల టన్నులు, దిగుమతి యూరియా మూడు లక్షల 96 మెట్రిక్ టన్నులు కాగా స్వదేశీ యూరియాలో 327 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈరోజు వరకు సరఫరా అయింది అన్నారు.ఆర్ ఎఫ్ సి ఎల్ లో 145 పని దినాల్లో కేవలం 78 రోజుల్లో ఉత్పత్తి జరగకపోవడంతోనే రాష్ట్రానికి తరపున కావాల్సిన యూరియా ఈరోజు వరకు కూడా సరఫరా కాలేదన్నారు.
బయట నుండి రావలసిన యూరియా ఏదైతే ఉన్నాదో యూరియా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం రాష్ట్రానికి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో యూరియా కొడతా రాబోతుందని మీరు ఇప్పటివరకు దిగుమతి చేయవలసిన యూరియా ఇంకా దిగుమతి చేయలేకపోయారని తక్షణమే దిగుమతి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మాసాల కిందనే జేపీ నడ్డా గారిని కలిసి విన్నవించిన కూడా కేంద్రం ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు.ఇక్కడి యూరియాను ఒక పద్ధతి ప్రకారం గా రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ పెట్టి ఎక్కడ పక్కదారి పట్టకుండా ఏ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే బిఆర్ఎస్ పార్టీ ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు .కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ ప్రదేశంలా అప్పుడు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ రైతులందని బస్సులలో అధిక సంఖ్యలో తీసుకొని వెళ్లి చూపించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు ఏళ్లలోనే కాళేశ్వరం కూలిపోవడం జరిగింది. కూలేశ్వరం ప్రాజెక్ట్ కు కేసీఆర్ , హరీష్ రావు పూర్తి బాధ్యత వహించాలి.
హరీష్ రావు గారు ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. నిత్యం అబద్ధపు మాటలు చెప్పే బి.ఆర్.ఎస్ పార్టీని ఎవ్వరు నమ్మే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో ఎక్కడ సాగునీరు పారిన కాళేశ్వరం నీరే అనే అబద్ధాలు చెప్పి బి.ఆర్.ఎస్ పార్టీ పబ్బం గడుపుకుంటుంది.అధికారం పోయిన తరువాత కొంతమందికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు కట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తానే ఇంజనీర్ అని చెప్పిన కేసీఆర్ బొక్కబోర్ల పడ్డారు. అన్ని ప్రాజెక్టులలో నీటిని నింపి రైతాంగాన్ని శాష్యశ్యమలం చేస్తాం అన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!