కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలను మూసివేయద్దు

కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలను మూసివేయద్దు

జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి

పెండింగ్లోఉన్న ఎక్స్ గ్రేసియా విడుదల చెయ్యాలే
                మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
హైదరాబాద్, ఆగస్ట్ 29(గోల్కొండ): సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడసంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ నేషనల్ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ వి జి ఆర్ నారగొని సర్దార్ సర్వాయిపాపన్న సినీ హీరో పంజాల జైహింద్ గౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్ గాదగొని చక్రధర్ గౌడ్ వివిధ గౌడ సంఘాల నాయకులు హాజరైయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ సోదరులకు 25 శాతం లిక్కర్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించి,పెండింగులో ఉన్న ఎక్స్ గ్రేషియా వెంటనే విడుదల చేసి హైదరాబాద్ లో ఉన్న కల్లు దుకాణాలపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.అలాగే గత ప్రభుత్వంలో గౌడులకు 15 శాతం లిక్కర్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చామని ప్రస్తుత ప్రభుత్వం25 శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పిందని వెంటనే అమలు చేసి, జనగామ జిల్లాకు సర్వాయిపాపన్న పేరు పెట్టాలని అన్నారు.కల్తీ పేరుతో కల్లు దుకాణాలు మూసివేయడం మంచిది కాదని గౌడ కులవృత్తిని దెబ్బ తీయాలని చూస్తున్నారని మన వృత్తిని కాపాడుకోవడానికి అందరం ఏకతాటిపై రావాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీతా వృత్తిదారునికి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న గౌడ గీతావృత్తిదారులను గుర్తించి సర్దార్ సర్వాయిపాపన్న సేవ పురస్కారాలు అందించారు.ప్రతిభను గుర్తించి అన్ని గౌడ సంఘాలను బీసీ సంఘాలను ఏకతాటిపై తీసుకువచ్చిన సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట కమిటీకి శ్రీనివాస్ గౌడ్అ భినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ సబాధ్యక్షత వహించగా రాష్ట గౌరవ అద్యక్షులు జోగు రవికుమార్ గౌడ్ రాష్ట ప్రధాన కార్యదర్శి పల్సo సోమన్న గౌడ్ ఉపాధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్, రేగటి నాగరాజు గౌడ్,గండి రంజిత్ కుమార్ గౌడ్, బొంగులూరి వెంకటేష్ గౌడ్, గణపతిరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!