
అర్చకులు, ఈవోలకు పదొన్నతులు..మంత్రి కృషితో పరిష్కారం
అర్చకులు మెడికల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్
హైదరాబాద్ ఆగస్టు 23 (గోల్కొండ ):
దేవాదాయ శాఖలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆలయాల అర్చకులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో దేవాదాయ శాఖ పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రి సురేఖ పదోన్నతి పొందిన అర్చకులు, ఈవోలకు ఆర్డర్ కాపీలను అందజేశారు. వివిధ దేవాలయాలలో పనిచేస్తున్న అర్చక, సిబ్బందికి జీవో ఎంఎస్.నం.261 ప్రకారం14 – వేదపరాయణం చేసేవారికి గ్రేడ్-III నుంచి II, గ్రేడ్-II నుంచి I, 2-పోస్టులు మొత్తం 16 మంది అభ్యర్థులను ఎంపికచేశారు. వీరికి మంత్రి ఉత్తర్వులు అందజేశారు. ఈఓ గ్రేడ్-III నుంచి ఈఓగ్రేడ్-II ఇద్దరు, మోఫిసిల్ సీనియర్ అసిస్టెంట్ నుంచి ఈఓ గ్రేడ్-II ఒకటి, దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ నుంచి కన్వర్షన్ ఆఫ్ సర్వీసెస్ కింద ముగ్గురు అభ్యర్థులకు ఈఓ గ్రేడ్-III గా మంత్రి సురేఖ ఉత్తర్వులను అందజేశారు. అసిస్టెంట్ కమిషనర్ క్యాటగిరిలో పదోన్నతులు పొందాల్సిన ఫీడర్ క్యాటగిరీస్ అయిన ఈఓ గ్రేడ్-I, మోఫిసిల్ సూపరిండెంట్స్, ప్రముఖ దేవాలయాల్లోని ఏఈఓల సీనియారిటీలు వివిధ కారణాలతో ఆగిపోగా.. ప్రభుత్వం సమీక్షించేందకు ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్మెంటల్ పదోన్నతులను త్వరితగతిన పరిష్కరించడానికి డిపార్టుమెంటు సిబ్బందితో పాటు… జీఏడీలో పనిచేసిన అనుభవం ఉన్న విశ్రాంత ఉద్యోగులతో కమిటీ వేసేందుకు చర్యలు చేపట్టారు.దేవాదాయ శాఖలోని ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పదవీ వీరమణ చేసిన అర్చక, ఇతర ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.4.00 లక్షల నుంచి రూ.8.00 లక్షలకు పెంచడానికి, హోసింగ్ లోన్‌లో రూ.10 లక్షల వరకు బ్యాంకు వడ్డీ, ఇతర సౌకర్యాలు అర్చక సంక్షేమ నిధి ద్వారా లబ్ధి చేకూర్చేందుకు మంత్రి సురేఖ ప్రత్యేకంగా కృషి చేశారు. దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు, ఇతర సిబ్బంది నలుగురికి మెడికల్ రీయంబర్స్మెంటు ప్రొసిడింగ్స్ అందజేశారు.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బంగారు గోపురం మొదలు కొని దేవాదాయశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మంత్రి సురేఖ ఎండోమెంట్ డైరెక్టర్ వెంకటరావు ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 10 పెద్ద దేవాలయాల అధివృద్ధి కోసం భక్తులకు మెరుగైన వసతుల కల్పించేందుకు మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.చాలా సంవత్సరాలు పెండింగులో ఉన్న మా అర్చకులు, ఈవోల సమస్యను పరిష్కరించిందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు జ్యోతిచంద్ర శర్మ, అర్చకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఈ పదోన్నతుల కోసం ఏండ్లుగా తిరిగినా కాలేదు. కానీ, మంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రత్యేక చొరవతో ముందుకు తీసుకెళ్ళారు. అందుకు మాకు సంతోషంగా ఉన్నది. ఇందుకు గానూ మంత్రి సురేఖకి ఆ భగవంతుడి ఆశీస్సులుంటాయని కొరారు.
ఈ కార్యక్రమంలో ఎండోమెంటు డైరెక్టర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఏడీసీ శ్రీనివాసరావు, జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు, డిప్యూటీ కమిషనర్ వినోద్ కుమార్, కృష్ణప్రసాద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


