సామాజిక సంక్షేమ శాఖ పై మంత్రి అడ్లూరి సమీక్షా

సామాజిక సంక్షేమ శాఖ పై మంత్రి అడ్లూరి సమీక్షా

హైదరాబాద్ ఆగస్టు 18 (గోల్కొండ ):
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో శాఖపరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు .
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తరపున సామాజిక సంక్షేమ శాఖకు అందాల్సిన నిధుల పై సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి , సామాజిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో కలిసి నిధులపై విస్తృత చర్చ జరిపి, అన్ని అంశాలను సమగ్రంగా సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి నివేదిక సిద్ధం చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.
మంత్రి మాట్లాడుతూ,గత ప్రభుత్వంలో దీనిపై సమీక్ష చేయకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాక పేద ప్రజలకు అందాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నష్టపోయాయి అని తెలిపారు.మంత్రి గా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి సమీక్షిస్తూ, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తేవాలి అనే అంశంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నాను అని తెలిపారు.మంత్రి గా ప్రత్యేకంగా ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే దిశగా చర్యలు చేపడతామని, విద్యా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.అలాగే, గురుకులాల్లో డైటింగ్ విషయంలో నాణ్యత ఉండాలని, దానికి కావాల్సిన నిధులు ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను ప్రత్యక్షంగా సమర్పించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరితగతిన పొందేలా కృషి చేస్తామని అన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!