డీజిపి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మాహిళా కానిస్టేబుల్

డీజిపి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మాహిళా కానిస్టేబుల్

వీణవంక, ఏప్రిల్ 17(గోల్కొండ):
వీణవంక పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న జీ.మమత మహిళా కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు డీజిపి అభినందించారు . కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు రాష్ట్ర డీజీపీ శివదర్ రెడ్డి కరీంనగర్ సీపీ గౌస్ ఆలం చేతుల మీదుగా అవార్డును అందజేశారు.ఎస్సై తిరుపతి, తోటి పోలీస్ సిబ్బంది మహిళా కానిస్టేబుల్ మమత అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్న అరైవ్ & అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు పై వ్యాస రచన పోటీలు హుజురాబాద్ డివిజన్ స్థాయిలో నిర్వహించారు.ఈ పోటీలలో వీణవంక మండలం చల్లూరు అల్ప్రెడ్ నోబెల్ పాఠశాలలో పదవ తరగతి చదివే విధ్యార్థి ఏ వర్షిత 2వ స్థానం సాధించగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు రాష్ట్ర డీజీపీ శివదర్ రెడ్డి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం చేతుల మీదుగా బహుమతిని అందజేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!