అన్న, నాన్నా.. వాళ్లతో జాగ్రత్త: ఎమ్మెల్సీ కవిత

అన్న, నాన్నా.. వాళ్లతో జాగ్రత్త: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు
హరీష్‌రావు, సంతోష్‌రావు లు కెసిఆర్ ను కామారెడ్డి లో ఓడించారు
పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోంది

హైదరాబాద్ సెప్టెంబర్ 03 (గోల్కొండ ):
బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవిత మాట్లాడారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు దుష్టచతుష్టయం ఏదో ప్రచారం చేస్తుందంటూ కవిత మండిపడ్డారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వద్దకు వెళ్లితే.. తనను గన్‌మెన్లు అడ్డుకున్నట్లు రాయించారన్నారు.
హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు.
ఆరడుగు బుల్లెట్ ఈ రోజు తనను గాయపరిచిందన్నారు. సంతోష్ రావు.. చేసిన పనులతో కేటీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్, సంతోష్ మూఠాలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయన్నారు. హరీష్ రావును పక్కన పెట్టుకుని.. నిజాలు మాట్లాడిన తనను బయటకు పంపాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్‌రావు డబ్బు పంపారన్నారు. పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని, హరీష్‌రావు ,సంతోష్ బీఆర్‌ఎస్‌ను జలగల్లాగా పట్టిపీడిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీతో ఇద్దరూ అంటకాగుతున్నారన్నారు. సంతోష్‌రావు బాధితులు చాలా మంది తనకు ఫోన్ చేస్తున్నారని చెప్పారు.
సొంత కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సంతోష్ రావుకు ధన దాహానికి అడ్డు అదుపు లేదని.. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్ అనే అన్నారు. చేపించింది ఒకరైతే చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు వచ్చిందని అన్నారు.
సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడు అని తనకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారని కవిత అన్నారు. రూ. 750 కోట్ల విల్లా ఎక్కడిదితనికి?. నవీన్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. హరీష్ రావు , సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్ , బీజేపీ లతో కుమ్మక్కై బీఆర్ఎస్ ను ఓడిపోయేలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
నాన్న జాగ్రత్త!..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయేలా చేసిన వ్యక్తులు ఈ ఇద్దరే అని మండిపడ్డారు. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారని అన్నారు. హరీష్ రావు చేస్తున్న రాజకీయం చూసి నేర్చుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు. ఈ ఇద్దరినీ పార్టీలో ఉంచుకుంటే మిమ్మల్ని కూడా మింగేస్తారని కేసీఆర్ కు సూచించారు. వీరితో జాగ్రత్తగా ఉండాలనికేటీఆర్, కేసీఆర్ లకు ముందస్తు జాగ్రత్తలు చెప్పారు కవిత.
రెండు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. చివరకు తనకు సస్పెన్షన్ దక్కిందంటూ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. వివరణ కూడా కోరకుండా తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో తాను పార్టీ కోసం, తెలంగాణ కోసం మాత్రమే కష్టపడ్డానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. అమ్మకు కూడా దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉందన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తనకు ఏ పార్టీతో పని లేదని కుండ బద్దలు కొట్టారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
నేను అలా అనలేదు..
బీఆర్ఎస్ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని తాను అనలేదని ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని అన్నట్లు వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన శరీరం బీఆర్ఎస్ అయితే.. తన ఆత్మ జాగృతి అని అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తాను పని చేశానన్నారు.
నేను ఏం చేయలేదా?
బీఆర్ఎస్‌లో తన భాగస్వామ్యం ఏం లేదా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు భాగస్వామ్యం మాత్రమే ఉందా? అని అడిగారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్టుగా ప్రచారం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్‌ దగ్గరకు వెళ్తే గన్‌మెన్లు తనను అడ్డుకున్నట్టు రాయించారన్నారు. లేఖ లీక్‌ చేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను ఆమె ప్రశ్నించారు. పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేదని.. తానకు అమ్మ అంటే చాలా ఇష్టమన్నారు. ఆమెను కలవలేక పోతున్నట్లు కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చింది. నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఆమె ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొందరు ఎవరికోసమో.. హరీష్ రావును టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రక్షణగా ఉండాల్సిన సమయంలో ప్రత్యర్థులకు ఊతం ఇచ్చేలా మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తేల్చుకోవడానికి పద్ధతులు వేరే ఉన్నాయని సూచించారు. శత్రువులకు బలం చేకూర్చేలా మాట్లాడటంలో ఎజెండా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్‌రావు సహా అందరం బాధపడ్డామని గుర్తు చేశారు. వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు సరికాదు నిరంజన్‌ రెడ్డి హితవు పలికారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!