సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (గోల్కొండ ) : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న బీఆర్ గవాయ్ నవంబర్ 23వ తేదీన రిటైర్ కానున్నారు.
సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను నియమించాలంటూ కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సిఫార్సు చేసిన కొన్ని గంటల్లోనే జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్నికేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!