వన దేవతలకు మొక్కుల సమర్పన వైభవం గా వీణవంక మినీ మేడారం  జాతర

వన దేవతలకు మొక్కుల సమర్పన వైభవం గా వీణవంక మినీ మేడారం జాతర

వీణవంక, జనవరి 30(గోల్కొండ)

మినీ మీడారంగా ప్రసిద్ధిగాంచిన వీణవంక సమ్మక్క సారాలమ్మ అర్థ శాతాబ్ది ఉత్సవ జాతర వైభవం గా జరుగుతున్నాయి.వరాల తల్లి వన దేవత శుక్రవారం రాత్రి గద్దెల వద్దకు రాగా చేరుకుంది.కుంకుమ భరిణి సమ్మక్క ప్రతి రూపాన్ని పూజారులు గద్దెల పైకి తీసుకొచ్చారు. శనివారం ఉదయం భక్తులు భారీగా క్యూ లైన్ కట్టారు. సూదూర ప్రాంతాల నుండి వచ్చిన వారు.జంపన్న వాగు లో స్నానం ఆచరించి పూజలు చేశారు.శివసత్తుల పూనకాల తో, వడి బియ్యం, అమ్మ వార్లకు ఎత్తు బంగారాలు, కుంకుమ, పసుపు లు అమ్మ వార్లకు సమర్పంచి భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు. వీణవంక చల్లురు కొర్కళ్ గంగారం పొతిరెడ్డిపల్లి లో కన్నుల పండగగా జాతర నిర్వహించరు

వన దేవతలకు ఎత్తు బంగారం సమర్పించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ వన దేవతలకు పాడి కుటుంబ సభ్యులు,పాడి రామ కృష్ణా రెడ్డి, యుప్ టివి సీ ఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి నిలువెత్తు బెల్లం బంగారాలను సమర్పంచి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ వన దేవతల దర్శనం లో నేషనల్ కమిషనర్ ఎస్సి సెక్రెటరీ ఐఏఎస్ జీ శ్రీనివాస్, ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్,
మాజీ డీజిపి అనురాగ్ శర్మ,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, ఏసీపీ మాధవి, రూరల్ సిఐ లక్షి నారాయణ ఎస్సై తిరుపతి లు,అమ్మ వార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించు కున్నారు.

వీణవంక జాతర పై వివాదాలు చేయొద్దు*
*మీడియా సమావేశం లో పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక సమ్మక్క -సారలమ్మ జాతర
1976 నుంచి స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర ప్రారంభించామని,తదనంతరం వారి వారసులైన పాడి రామకృష్ణారెడ్డి గ1980 నుంచి తర్వాత 20 సంవత్సరాలుగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నామని అన్నారు.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భక్తులందరికీ అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నామని పాడి ఉదయ్ నందన్ రెడ్డి తెలిపారు.శనివారం రోజు తన నివాసంలో వీణవంక జాతర వివాదాం పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భక్తులందరికీ అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగానిర్వహింస్తున్నామన్నారు.సమ్మక్క సారాలమ్మ జాతర నిర్వహిణ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హై కోర్టు తీర్పు ను దిక్కరించారని ఉదయ్ నందన్ రెడ్డి మండి పడ్డారు.
గత యాబై ఏళ్లుగా తమ సొంత భూమి లో జాతర నిర్వహిస్తూ ఉంటే
గద్దెల మీద కూర్చొని అమ్మవార్లను అడ్డుకొని భక్తులకు ఆటంకాలు కలిగించడం దారుణమన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!