
ముత్యాలమ్మ అలయ నిర్మాణానికి భూమి పూజా చేసిన కమిటీ సభ్యులు
హైదరాబాద్ సిటి ఆగస్టు 09 (గోల్కొండ ప్రతినిధి):హైద్రాబాద్ ఎల్బీ నగర్ నియోజక వర్గం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ లో శనివారం ప్రజయ్ నివాస్ ఫేస్ 2 లో శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అలయ నిర్మాణానికి కమిటీ సభ్యులు భూమి పూజా చేసి శంకుస్థాపన చేశారు.కాలనీవాసులు అమ్మవారి గుడి కట్టుకోవాలనే 25 సంవత్సరాల కల నెరవేరినందుకు హర్షం వ్యక్తం చెశారు. కాలని వాసులు అలయ నిర్మాణానికి విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంట్టున్నారు. ప్రతి ఒక్కరు ఆలయ నిర్మాణానికి తమవంతు విరళాలు వస్తు రూపేణా లేదా నగదు రూపంలో కమిటీ సభ్యులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొత్త తిరుమల్, అవునూరి శ్రీనివాస్, నరసింహ, శంకర్ రావు, మహేష్, శ్రవణ్ గౌడ్, కృష్ణప్రసాద్, నరసింహ, రాంచంద్రం, నరేందర్, రవి, సత్యనారాయణ, రైక శ్రీనివాస్, ఎల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గోన్నారు.



